క్రైమ్తెలంగాణ

ఉగ్రవాదులకు అడ్డాగా ఒవైసీ కాలేజీలు? కేంద్ర బలగాలతో హైదరాబాద్‌కు అమిత్ షా!

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలోకి అమ్మవారి విగ్రహాం ధ్వంసం ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయంలోకి ఎంటరైన ఒక వర్గం వ్యక్తి కాలితో ముత్యాలమ్మ విగ్రహాన్ని కాలితో తన్నీ మరీ ముక్కలు చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విజువల్స్ చూసిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి.నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలని స్థానిక భక్తులు పోలీసులను నిలదీస్తున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను గుడికి రాకుండా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ధ్వంసమైన అమ్మవారి విగ్రహాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. సంచలన ఆరోపణలు చేశారు, ఎంఐఎం పార్టీ అధినాయకుడి మెడికల్ కాలేజీలను ఉగ్రవాదులకు స్థావరంగా మార్చారని ఆరోపించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే వ్యక్తి అక్కడ మెయిన్ ఆఫీసర్‌గా ఉన్నాడన్నారు బండి సంజయ్. 140 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హోటల్ లో ఉన్నా హైదరాబాద్ పోలీసులు ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ముత్యాలమ్మ విగ్రదం ధ్వంసం ఘటనపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తొంది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులకు ఫోన్ చేసి ఘటన ఎలా జరిగిందనే సమాచారం తీసుకున్నారని సమాచారం. హైదరబాద్ లో పరిస్థితులు, ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం.హైదరబాద్ కు అదనంగా కేంద్రబలగాలను కూడా పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమిత్ షాహైదరాబాద్ కు వచ్చి ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Back to top button