ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ పై వేటు పడింది. ఆయనను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్దారణ కావడంతో సీఐ సత్యనారాయణపై వేటు పడింది. హయత్ నగర్ మహిళ కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో సీపీ సీరియస్ అయ్యారు. నిందితుల అరెస్ట్ విషయం లో నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణను సీపీ కార్యాలయంకు అటాచ్ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.