తెలంగాణ

ఇద్దరు గన్ మెన్లు తొలగింపు.. కొండా సురేఖకు రేవంత్ షాక్

కేటీఆర్-సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కొండాపై సినీ ఇండస్ట్రీ వార్ ప్రకచించింది. కొండా వ్యాఖ్యలను ఖండిస్తూ వివిధ వర్గాల వారు ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొండాపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అయితే కొండా సురేఖ మాత్రం ఒంటరయ్యారు. ఆమెకు మద్దతుగా మాట్లాడటానికి కాంగ్రెస్ నేతలు కూడా ముందుకు రావడం లేదు. కొండా వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రచ్చగా మారడంతో హైకమాండ్ కమాండ్ తలలు పట్టుకుంటోంది. కొండా తీరుపై టీపీసీసీ నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డపై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తెలంగాణలో అసలేం జరుగుతోంది.. మంత్రులు ఏం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా.. ఆయనకు మంత్రులపై కంట్రోల్ ఉందా అన్న చర్చలు సాగుతున్నాయని సమాచారం.

హైకమాండ్ సీరియస్ తో కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కొండాకు వరంగల్ పోలీసులు షాకిచ్చారు. ఆమె ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ కు కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను తొలగించారు. నవీన్ రాజ్ గన్ మెన్లను వీఆర్ కు అటాచ్ చేస్తూ వరంగల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇది కొండాకు పెద్ద షాక్. మంత్రి కాగానే ఆమె నవీన్ రాజ్ కు గన్ మెన్లను కేటాయించింది. అయితే నవీన్ రాజ్ జిల్లాలో పెత్తనం చేస్తున్నారని.. అందరిని బెదిరిస్తున్నారని.. పోలీసు అధికారులను లెక్క చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలంగా నవీన్ రాజ్ పై ఫిర్యాదులు వస్తున్నా.. ఇప్పుడు తొలగించారంటే డైరెక్టుగా కొండాను టార్గెట్ చేశారనే టాక్ వస్తోంది.

మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా ఖండించారు. మంత్రి పదవి నుండి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఓ జాతీయ చానెల్ డిబేట్ లో మాట్లాడిన శ్యామ్ ప్రసాద్ మేకా.. కొండా కామెంట్లను తీవ్రంగా ఖండించారు.

Back to top button