టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం వివాదంలో చిక్కుకున్నారు. వేదాలు, మనుచరిత్రపై బ్రహ్మానందం చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వేదాలు, మనుచరిత్ర వంటి ప్రాచీన గ్రంథాల్లో మహిళలను అణచివేసే భావాలు ఉన్నాయని బ్రహ్మానందం అన్నారు. వారిని వంటింటికే పరిమితం చేయాలని,చదువుకు దూరం చేయాలని రాసి ఉందని అన్నారు.
హిందూ ధర్మం మహిళలను చులకనగా చూసిందని చెప్పారు బ్రహ్మానందం. ఈ ధోరణి ఇప్పటికైనా మారాలని..మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలంటే సావిత్రిబాయి పూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని బ్రహ్మానందం సూచించారు. బ్రహ్మానందం వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.హిందూ ధర్మం గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నిస్తున్నారు.సరిగ్గా అవగాహన లేని విషయాల గురించి మాట్లాడవద్దని హితవు పలుకుతున్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి నేటి మహిళా సైన్యం వరకు, భారతీయ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారని హిందూ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఋగ్వేదం వంటి గ్రంథాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని..వేదాల్లో ఎక్కడా మహిళలను చదువుకు దూరం చేయాలని రాయలేదని స్పష్టం చేస్తున్నారు. బ్రహ్మానందం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందూ ధర్మంపై అనవసరంగా చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.