తెలంగాణ

ఆగమైన హైదరాబాద్.. సగానికి పడిపోయిన ఆఫీస్ స్పేస్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో వెనకబడి పోతోంది. గత పదేళ్లుగా దూసుకుపోయిన హైదరాబాద్ లో ఒక్కసారిగా డౌన్ ఫాల్ కనిపిస్తోంది. ఇప్పటికే నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ భారీగా తగ్గిపోయింది. తాజాగా వచ్చిన నివేదికలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ భారీగా పడిపోయినట్లు తేలింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఏకంగా 54 శాతం పడిపోయింది హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్‌

Q3 2023లో 2.38 మిలియన్ చదరపు అడుగుల గల బెంగళూరు ఆఫీస్ స్పేస్‌ను అధిగమిస్తూ హైదరాబాద్ 2.70 మిలియన్ చదరపు అడుగులతో భారతదేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ ఏడాది మాత్రం హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 1.26 మిలియన్ చదరపు అడుగులకు పడిపోగా.. బెంగళూరులో మాత్రం 4.14 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే రియల్ ఎస్టేట్ తో పాటు ఆఫీసు స్పేస్ లీజింగ్ పడిపోతూ వచ్చింది. హైడ్రా ఎంట్రీతో అది మరింతగా పడిపోయింది. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ దందా పూర్తిగా నీరుగారి పోగా.. ఆ ప్రభావం ఆఫీస్ స్పేస్ లీజుపై కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ కు కోలుకోలిని దెబ్బ తగలడం ఖాయమనే చర్చ సాగుతుంది.

Back to top button