Monday, February 23, 2026
Homeతెలంగాణఅర్ధరాత్రి తప్పతాగి ఎస్ఐ హంగామా

అర్ధరాత్రి తప్పతాగి ఎస్ఐ హంగామా

 

యూనిఫాంకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు ఓ ఖాకీ. డ్యూటీలో చిల్లర చేష్టలు చేశాడు. అర్ధరాత్రి వీరంగం వేశాడు. జగిత్యాల పట్టణము వానినగర్ లో వినాయక నిమర్జన కార్యక్రమంలో ఎస్ఐ పడాల రాజేశ్వర్ హంగామా చేశాడు. మహిళలు వినాయక నిమర్జనం వీక్షిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులతో కారులో అక్కడికి వచ్చాడు రాజేశ్వర్. ఫుల్లుగా తాగి వచ్చిన ఎస్ఐ అక్కడ వీరంగం వేశాడు.

నిమర్జన కార్యక్రమం వీక్షించడానికి వచ్చిన వ్యక్తులు అడ్డుకోవడంతో వారిపై రాయితో దాడికి యత్నించాడు. నేను ఎస్ ఐ ని ఏమీ చేసుకుంటారో చే సుకోండి అంటూ అక్కడున్న యువకులపై దాడి చేసాడు ఎస్ఐ పడాల రాజేశ్వర్ నిజామాబాదులో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నారు. తప్పతాగి దాడికి పాల్పడిన రాజేశ్వర్ పై యాక్షన్ తీసుకోవాలని వానినగర్ వాసులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments