క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ బిజెవైఎం నాయకులను అర్ధరాత్రి 12 గం.లకు అక్రమ అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ అన్నారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. బీజేవైఎం జిల్లా నాయకులను అర్థరాత్రి 12గం.లకు అక్రమ అరెస్టు చేశారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, భారత రాజ్యాంగానికి లోబడి శాంతియుతంగా ధర్నా నిరసన కార్యక్రమాలు చేసే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని చదవాలని, రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని హేళన చేసే విధంగా చూపించడం సరికాదని, రాజ్యాంగంలో షెడ్యూల్ ను ప్రాథమిక హక్కులను ఆర్టికల్స్ మొత్తాన్ని చదవాలని, రాజ్యాంగాన్ని పట్టుకున్నంత మాత్రాన రాజ్యాంగంపై అవగాహన ఉండదని, రాజ్యాంగాన్ని చదివి అవగాహన చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
Read Also : గౌడన్నతో రేవంతన్న… కాటమయ్య కిట్ల పంపిణీ
అక్రమ అరెస్టులతో భాజపా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయలేరని అన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రజల సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ అనుక్షణం కొట్లాడుతూ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేయవచ్చని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటని, నాడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని అన్నారు. స్థానిక మంత్రివర్యులు కూడా అక్రమ అరెస్టులను చేయకుండా నిర్మూలించాలని ప్రజల కోసం చేస్తున్న ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఎవరు అయినా కూడా గొంతు విప్పే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాయించు నాగరాజు, జిల్లా నాయకులు ఎల్కతుర్తి శివ, జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెపు ప్రవీణ్, జిల్లా కార్యదర్శి ఇనుముల మహేష్, బోగిరి రాకేష్, ఇరుసవట్ల నాగ సాయి, నూనెటి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :