Tuesday, February 24, 2026
Homeతెలంగాణఅరే ఉండు బే.. మహాగణపతి మండపంలో దానం బూతులు

అరే ఉండు బే.. మహాగణపతి మండపంలో దానం బూతులు

తన బాష, వ్యవహార శైలిలో ఎన్ని విమర్శలు వచ్చినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి దానం నాగేందర్ తీరు మారడం లేదు. పబ్లిక్ గానే నోరు పారేసుకుంటున్నారు. పవిత్రమైన ప్రాంతంలో బూతులు మాట్లాడుతున్నారు. ఇటీవలే అసెంబ్లీలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టాయి. అయినా దానం నాగేందర్ తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి బూతు పురాణం అందుకున్నారు దానం నాగేందర్.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే.. అది కూడా ఖైరతాబాద్ మహాగణపతి మండపంలో బూతులు మాట్లాడారు దానం నాగేందర్. మహా గణపతికి తొలి పూజకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రావడంతో మండపం వేదికపైకి స్థానిక నేతలు తోసుకువచ్చారు. వాళ్లను జరపడానితి బూతులు అందుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అరే జరుగు రా.. అరే ఉండు బే అంటూ వేదికపై ఉన్నవారిని కిందకు నెట్టేశారు. దానం నోటి నుంచి వచ్చిన బూతు పదాలు మైకులో వినిపించాయి. దీంతో అంతా షాకయ్యారు.

మహాగణపతి వేదికపై నిల్చుని.. సీఎం రేవంత్ రెడ్డి ముందే బూతులు మాట్లాడటంపై భక్తులు మండిపడుతున్నారు. దానం నాగేందర్ తీరు ఇక మారదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments