తెలంగాణ

అక్రమ కట్టడాలను అనుమతి ఇచ్చిన అధికారులు అరెస్ట్?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైడ్రాతో కబ్జాదారులకు నిద్ర లేకుండా చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారుని తెలుస్తోంది. చెరువు, ప్రభుత్వ భూముల్లో భవనాలు కట్టిన వారి భరతం పడుతున్న హైడ్రా.. ఇక ఆ అక్రమ భవంతులకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల ఆట కట్టించబోతోంది. ఇందుకు హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇవ్వబోతున్నారట. కూల్చివేతలు, కేసుల విషయంలో మరిన్ని పవర్స్ కల్పించడంతో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చే విషయంపైనా సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

చెరువు శిఖం భూములు, ఫుల్ ట్యాంక్ లెవల్లో అక్రమ నిర్మాణాలను కొన్ని రోజులుగా హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. అయితే అక్రమ కట్టడాలు సరే మరి వాటికి అనుమతి ఇచ్చిన అధికారుల సంగతేంటి అన్న ప్రశ్న ఎక్కువగా వినిపించింది. ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు ఇవ్వబట్టే వారు కట్టుకున్నారని… నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అనుమతులు మంజూరు చేసిన వారిదే మొదటి తప్పని నిర్ణయానికి వచ్చారు. లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

Read More : బుల్డోజర్స్ ఆన్ డ్యూటీ రాంనగర్‌లో ఇండ్లు నేలమట్టం

అక్రమ కట్టాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కేసులు పెట్టనున్నారు. ఈ మేరకు హైడ్రా ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తప్పు చేసిన అధికారులను అలా వదిలేస్తే.. తమకేమీ సమస్య రాదుగా అని.. అనుమతులు ఇచ్చే అధికారులు ఇస్తూనే ఉంటారని.. వారిని కట్టడి చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. సీఎం రేవంత్ ఆదేశాలతో మొత్తం అక్రమార్కుల లిస్ట్ హైడ్రా రెడీ చేసింది. ఒ వైపు అక్రమ కట్టడాలను కూల్చివేస్తూనే.. మరోవైపు ఆ కట్టడాలకు అక్రమంగా అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టి జైలుకు పంపేలా పక్కా ప్లాన్ సిద్ధమవుతోంది చెబుతున్నారు. అలా చేస్తేనే భవిష్యత్ లో మరోసారి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వాలంటే అధికారులు వణికిపోతారనే టాక్ వస్తోంది.

Back to top button