జాతీయం

మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే విజయం!

మహారాష్ట్రలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు బీజేపీ మహాయుతి కూటమికే పట్టం కట్టాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహాయుతి కూటమికి క్లియర్‌ మెజారిటీ దక్కనున్నట్లు దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. పీపుల్స్‌ పల్స్‌ మహాయుతి కుటమికి 175 నుంచి 195 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. కేకే సర్వే అయితే ఎన్డీఏకు భారీ మెజారిటీ దక్కనున్నట్లు అంచనా వేస్తోంది. ఈ సర్వే ప్రకారం ఎన్డీఏకు 225, ఇండియా కూటమికి 56 సీట్లు, ఇతరులకు 7 స్థానాలు దక్కనున్నట్లు పేర్కొంది.

ఇక మ్యాట్రిజ్‌ సర్వే ప్రకారం ఎన్డీఏకు 150 నుంచి 170 స్థానాలు, ఇండి కూటమికి 110 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. అటు సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 కూడా ఎన్డీఏకే పట్టం కట్టింది. ఎన్డీఏ 154 స్థానాలు, ఇండి కూటమికి 128 స్థానాలు వచ్చే అవకాశముంది. ఇతరులు ఆరు సీట్లను గెలుచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

ఇటు రిపబ్లిక్‌ టీవీ సర్వే ప్రకాం ఎన్డీఏకి 137 నుంచి 157 సీట్లు, ఇండి కూటమికి 126 నుంచి 146 సీట్లు, ఇతరులకు 2 నుంచి 6సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపింది. అలాగే ఛాణక్య సర్వే ప్రకారం ఎన్డీఏకి 152 నుంచి 160 సీట్లు, ఇండి కూటమికి 130 నుంచి 138 సీట్లు దక్కే అవకాశముంది. ఇతరులకు ఆరు నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఒక్క ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం డిఫరెంట్‌గా ఉన్నాయి. మహారాష్ట్రలో ఈసారి మహావికాస్ అఘాడీ కూటమిదే పవర్‌గా అంచనా వేసింది. ఆత్మసాక్షి ప్రకారం మహావికాస్‌ అఘాడీకి 147 నుంచి 155 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే మహాయుతి కూటమికి 127 నుంచి 137 సీట్లు సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది.

Back to top button