Wednesday, March 4, 2026
Homeజాతీయంప్లాస్టిక్ సర్జరీ పై వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించిన నయనతార!

ప్లాస్టిక్ సర్జరీ పై వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించిన నయనతార!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక నయనతార అనే చెప్పాలి. ఈమెని ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అని కూడా అంటారు. నయనతరవాత తమిళంలోను ఇటు తెలుగులోను కూడా చాలా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే చాలా రోజుల నుండి ఆమె ముఖం ను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా చాలా కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

నయనతార తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా చాలామంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార తన ఫేస్ ను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించారు. ఆ ప్రచారంలో అసలు ఎలాంటి నిజం లేదని నేను అసలు ప్లాస్టిక్ సర్జరీకి చాలా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నేను ప్రతిరోజు కూడా ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంటాను. కాబట్టి ఐబ్రోస్ లో కొంచెం తేడా కనపడటం వల్ల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని చాలామంది కూడా అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని నయనతార ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటికైనా నా ఫేస్ పై ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఉంటారని నేను నమ్ముతున్నానని చెప్పుకొచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments