తెలంగాణ

ప్రజా పాలన దరఖాస్తు దారులకు ఎడిటింగ్ ఆప్షన్

చండూరు, క్రైమ్ మిర్రర్:ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న వారికి మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మున్సిపల్ ప్రజలకు మున్సిపాలిటీ కార్యాలయంలో, గ్రామీణ ప్రజలకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా పాలన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజా పాలన దరఖాస్తు తీసుకుని వెళ్తే ఆన్లైన్లో మన వివరాలను సరి చూసుకోవచ్చు. అలాగే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు గతంలో గృహ జ్యోతి కింద వివరాలు తప్పుగా ఇచ్చుంటే మళ్ళీ సరి చేసుకోవచ్చు. అలాగే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారినప్పుడు సర్వీస్ నెంబర్ ను కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా గ్యాస్,పింఛన్ ఇత సంబంధించి వివరాలను  ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ అవకాశం ప్రజా పాలన దరఖాస్తుదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అప్పుడు దరఖాస్తు చేసుకోని వారికి ఎలాంటి ఆప్షను లేదు. అప్పుడు దరఖాస్తు చేసుకొని వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అద్దె ఇంట్లో  ఉండే వారు పలువురు ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకోలేదు. వారు నష్టపోయే అవకాశం ఉన్నందున మళ్లీ అవకాశం కల్పించాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది.

Spread the love
Back to top button