తెలంగాణ

కేటీఆర్ భార్యను పట్టించింది హరీష్ రావు భార్యేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావమరిది రాజ్ పాకాల జన్వాడ ఇంటిలో జరిగిన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కేటీఆర్ భామ్మర్ది ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ జరిగిందని.. డ్రగ్స్ పార్టీ జరిగిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ఫ్యామిలీ కూడా ఆ పార్టీలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ సతీమణి శైలిమా పార్టీలో ఉన్న వీడియోలు, ఫోటోలు ఇవిగో అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ ఫ్యామిలీ అడ్డంగా దొరికినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రావుల డ్రగ్స్ పార్టీ అంటూ కేటీఆర్, కేసీఆర్ ను ఓ రేంజ్ లో ఏకిపడేస్తున్నారు.

బీఆర్ఎస్ నేతలు మాత్రం ఫ్యామిలీ పార్టీపై ఇంత రచ్చ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా చెప్పడానికి సిగ్గుండాలంటూ ఘాటుగా స్పందిస్తున్నారు గులాబీ లీడర్లు. కేటీఆర్ కుటుంబ సభ్యులెవరు ఆ పార్టీలో లేరని చెబుతున్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేయడానికే ఇలాంటి చిల్లర కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాజకీయ పార్టీల వాదనలు ఎలా ఉన్నా.. పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో రాజ్ పాకాలా మొకిలా పోలీసుల ముందు హాజరుకానున్నారు.

తాజాగా జన్వాడ ఫాంహౌజ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కేటీఆర్ భార్య సతీమణిని ఇరికించింది వాళ్ల కుటుంబానికి చెందిన మహిళే అనే వార్తలు వస్తున్నాయి. మెదక్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే భార్యే శైలిమను పట్టించిందని.. పార్టీ జరుగుతున్న విషయాన్ని కావాలనే పోలీసులు చెప్పిందనే టాక్ వస్తోంది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారని అంటున్నారు. దీంతో గచ్చిబౌలిలో ఉంటున్న మాజీ మంత్రి హరీష్ రావు భార్యే కేటీఆర్ భార్య శైలిమను పోలీసులకు పట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీకి దగ్గరి బంధువైన తమకు ఆహ్వానం లేకపోవడంతో అవమానంగా భావించిన హరీష్ రావు భార్యే.. పోలీసులకు పార్టీ విషయం లీక్ చేసి పట్టించిందనే వార్తలు కాంగ్రెస్ వర్గాలు వైరల్ చేస్తున్నాయి.

కేటీఆర్ భార్య శైలిమతో హరీష్ రావు భార్యకు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. గత నాలుగైదు ఏండ్లలో శైలిమతో కలిసి హరీష్ రావు భార్య ఏ ఫంక్షన్ లోనూ పాల్గొనలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కేటీఆర్ భార్యపై అసహనంతో ఉన్న హరీష్ రావు భార్య టైం చూసి దెబకొట్టిందని సమాచారం.

Back to top button