గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలనూ కూల్చేస్తున్న హైడ్రా మరింత దూకుడు పెంచింది. కబ్జాదారుల భరతం పట్టడంతో పాటు అక్రమ నిర్మాణాలను అనుమతులు ఇచ్చిన అధికారులపైనా యాక్షన్ కు దిగింది. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అనుమతి ఇచ్చిన అధికారులను గుర్తించి ఏకంగా కేసులు నమోదయ్యేలా చేస్తోంది. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ EOW వింగ్‌లో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై ఫిర్యాదు చేసింది హైడ్రా. దీనిపై విచారణ జరిపిన సీపీ అవినాష్.. కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో చెరువుల FTL పరిధిలో భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు బుక్ అయ్యాయి.
కేసులు నమోదైన అధికారులు..
1)నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ
2)చందానగర్ GHMC డిప్యూటీ కమిషనర్ సుధాన్ష్
3)బాచుపల్లి MRO పూల్ సింగ్
4)మేడ్చల్-మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు
5)HMDA అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్
6)HMDA సిటీ ప్లానర్ రాజ్‌కుమార్