
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026 లో భాగంగా ఒక సంచలన విషయమైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లక్నో సూపర్ జేమ్స్ జట్టు హెడ్ కోచ్ గా యువరాజ్ సింగ్ వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో అయితే చాలానే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లక్నో సూపర్ జేయింట్స్ ఫ్రాంచైజీ యువరాజ్ సింగ్ తో చర్చలు కూడా జరిపారు అని సమాచారం. అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే కాని నిజమైతే ఐపీఎల్ లో ఒక విధ్వంసాన్ని చూడవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని వద్ద శిక్షణ తీసుకున్నటువంటి అభిషేక్ శర్మ ఏ విధంగా ఆడుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువరాజ్ సింగ్ అంటేనే చాలా దూకుడుగా ఆడుతాడు, ఆడిస్తాడు కూడా. కాబట్టి ఒకవేళ లక్నో సూపర్ జయంట్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కానీ ఎంపిక అయితే మాత్రం ఆ జుట్టునుంచి ఇక మనం పూనకాలు చూడవచ్చు. గత సీజన్లో LSG జట్టుకు కోచ్గా ఆసీస్ మాజీ ప్లేయర్ అయినటువంటి జస్టిన్ లాంగర్ పని చేశారు. రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించారు. మంచి ప్లేయర్లు ఉన్న జట్టు అయినప్పటికీ పాయింట్స్ టేబుల్ లో ఏడవ స్థానానికి పరిమితమైంది. దీంతో అనూహ్య ఆలోచనలతో నేరుగా యువరాజ్ సింగ్ ను హెడ్ కోచ్గా తీసుకువస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అంటేనే పూనకాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే హెడ్ కోచ్ గా యువరాజ్ సింగ్ కన్ఫర్మ్ అయితే మాత్రం ఈసారి మరో LSG జట్టును చూడవచ్చు.
Read also : ఈ రెండు రోజులు సేఫ్.. మరో వాయుగుండంతో భారీ వర్షాలు
Read also : రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేనట్టే! రేవంత్ దిమ్మతిరిగే షాక్





