
మునుగోడు, క్రైమ్ మిర్రర్: మునుగోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) గా జీ. యుగంధర్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీఓ ఎం.డి. పర్వేజ్, పంచాయతీ కార్యదర్శులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంపీడీవో యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం కార్యాచరణను వేగవంతం చేస్తాం. ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో మునుగోడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు. కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు చిత్రం రమేష్, మండల కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.