
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకున్న కూడా వెంటనే దాన్ని అధికార పార్టీపై నెట్టేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ అంటేనే ఒక ఫేక్ పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ పార్టీకి అధికార పార్టీని ఎదుర్కోవడానికి ఎటువంటి వార్తలు లేకపోవడంతో ఇటువంటి శవ రాజకీయాలు చేస్తున్నారు అని తీవ్రంగా మండిపడ్డారు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకున్న కూడా వెంటనే అది కూటమి ప్రభుత్వం వల్లనే అని పేపర్ లేదా టీవీల ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ఒక పాంప్లెట్,టీవీ ఉన్నాయి అని… ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే అంతవరకు కూడా వాటితో శవరాజకీయాలు చేస్తూనే ఉంటారు అని అన్నారు. కమ్మ మరియు కాపు కులాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. వీటిపై త్వరలోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని తీవ్రంగా హెచ్చరించారు. మొన్న కర్నూల్ బస్సు ప్రమాదం పైన కూడా కూటమి ప్రభుత్వానిదే తప్పు అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఈరోజు తొక్కిసలాట జరిగి ప్రజలు మరణిస్తే దీన్ని కూడా ఓటమి ప్రభుత్వం పైనే నడుతుంది అని ఆగ్రహించారు.
Read also : శ్రీకాకుళం తొక్కిసలాట పై స్పందించిన జగన్.. మళ్ళీ చంద్రబాబుదే తప్పు!
Read also : పెండింగ్ లో 900 కోట్లు.. మూడవ తేదీ నుంచి కాలేజీల బంద్!





