
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ పార్టీపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు అయినటువంటి కొండారెడ్డిని ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సందర్భంలో మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ రాష్ట్రంలో ఉండకూడదని ప్రభుత్వం ఒక యుద్ధమే చేస్తుంటే వైసీపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు మాత్రం వీటిని వదిలే పరిస్థితిలో కనబడడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెత్త పనులు చేయడం, ఉదయం లేచిన దగ్గరనుంచి రాష్ట్రంలో ఏదో ఒకటి అయిపోతుంది అంటూ హడావుడి చేస్తూ ఒకవైపు ప్రభుత్వాన్ని మరోవైపు ప్రజలను కూడా భయపెట్టి విధంగా చేయడం వైసీపీ పార్టీకి ఒక పనిగా మారిపోయింది అని అన్నారు. రాష్ట్రంలో శవ రాజకీయాలు చేయడం ఈ పార్టీని చూసే నేర్చుకోవచ్చు అని అన్నారు. అందుకు కాదా వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని అనేది.. ఈ విషయాన్ని ఊరికే ఎవరు అనరు అని అన్నారు. వైసీపీ పార్టీని నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు అంటూ ఒక డ్రగ్ వింగ్ అని కీలక ఆరోపనులు చేశారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రానివ్వకుండా వైసిపి పార్టీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి కోసం ముందుకు వస్తే కలిసికట్టుగా ముందుకు వెళ్దాం.. ఇలాంటి చెత్త పనులు ఇకనైనా మానుకోవాలి అని సూచించారు. ఎలక్షన్ల టైం లోనే రాజకీయాలు చేయాలి కానీ.. ఈ సమయంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి అని సూచించారు.
Read also : బంద్ కొనసాగుతున్న ప్రభుత్వం స్పందించట్లేదు : చైర్మన్ రమేష్ నాయుడు
Read also : చేవెళ్ల బస్సు ప్రమాదం మృతుల వివరాలు ఇవే!





