
Y. S. Sharmila : ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్డీఏ తరుపున పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేసింది.
ఇందులో భాగంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలంటూ ఘాటుగా విమర్శించింది. అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ కేసుకు భయపడి బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారని అంతేకాదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు సెంట్రల్ లో ఉన్న బీజేపీకి దాసోహం అంటున్నారంటూ సంచలన వాఖ్యలు చేసింది.
అలాగే వైసీపీ పార్టీ ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని. బీజేపీకి బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగిందని అన్నారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి పక్షమేనని తేటతెల్లమైందని, అందుకే BJP అంటే ” బాబు -జగన్, -పవన్ ” అని, ఈ ముగ్గురు మోడీ గారి తొత్తులే అంటూ ఘాటు విమర్శలు చేసింది. ఈ ముగ్గురి పార్టీలు కలసి బీజేపీకి ఊడిగం చేసే బానిసలని పేర్కొంది. ఐతే ఇందులో టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు అని కానీ వైసీపీ ది మాత్రం తెరవెనుక అక్రమ పొత్తు అని ఘాటుగా విమర్శించింది. దీంతో షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అలాగే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి బానిసలు, దాసోహం అంటూ పెద్ద పెద్ద షర్మిల చేసిన కామెంట్లపై టిడిపి, జనసేన, వైసీపీ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.