ఆంధ్ర ప్రదేశ్

బుగ్గన, రోజాకు వైఎస్‌ జగన్‌ క్లాస్‌ - తప్పు రిపీట్‌ చేయొద్దంటూ వార్నింగ్‌..!

వైసీపీలో కొందరు సీనియర్‌ నేతల తీరుపై వైఎస్‌ జగన్‌ కోపంగా ఉన్నారట. పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా… ముఖం చాటేస్తుండటంతో… వారిని పిలిచి క్లాస్‌ తీసుకుంటున్నారట. మరోసారి తప్పు జరిగితే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చారు. జగన్‌ వార్నింగ్‌ ఇచ్చింది ఎవరికో కాదు… మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆర్కే రోజాకే. ఇంతకీ వీరు చేసిన తప్పేంటి..? ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్‌ కాలేదు..?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ మధ్యన రైతు పోరు, ఫీజు పోరు వంటి కార్యక్రమాలను చేపట్టింది. రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఫీజు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది వైసీపీ. కూటమి ప్రభుత్వం వచ్చాక… ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించలేదని.. దీంతో ప్రైవేట్‌ కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వైసీపీ ఆరోపిస్తుస్తోంది. ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఫీజు పోరు చేపట్టింది. అయితే… ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలే డుమ్మా కొట్టారట. దీంతో… వైఎస్‌ జగన్‌కు వారిపై పట్టరాని కోపం వచ్చిందని సమాచారం. ఫీజు పోరులో పాల్గొనని పార్టీ ఇన్‌చార్జ్‌లు, సీనియర్‌ నేతలపై.. ఓ రేంజ్‌లో ఫైరయ్యారట వైఎస్‌ జగన్‌.


Also Read : ఎక్కడున్నారు సార్‌.. వెయిటింగ్‌ ఇక్కడ – జగన్‌ జిల్లాల పర్యటనపై కేడర్‌ ఎదురుచూపులు


ఫీజు పోరు ప్రోగ్రామ్‌లో మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్కే రోజా కూడా పాల్గొనలేదు. దీంతో.. వీరిపై జగన్‌ సీరియస్‌ అయ్యారట. వారిని పిలిపించి… గట్టిగా క్లాస్‌ ఇచ్చారని సమాచారం. పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారట జగన్‌. ఒక్కోసారి ఇలా చేయొద్దని… వార్నింగ్‌ ఇచ్చారట. జగన్‌కు వివరణ ఇచ్చేందుకు… దాదాపు రెండు రోజుల పాటు తిరిగారట ఆ ఇద్దరు మాజీ మంత్రులు.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button