
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. తను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అని ఆరోపించారు. ఒక ఆర్థిక నేరస్తుడిని పట్టుకొని ఆర్థికవేత్త అంటూ వైసీపీ నేతలందరూ బిల్డప్పులు ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఉన్న ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నిటిని కూడా సర్వనాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల్ని అప్పుల ఊబిలో నెట్టిన దుర్మార్గపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తాజాగా మద్యం కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డితో సహా వైసిపి నేతల పాత్రలు బయటపడుతున్నాయి అని తెలిపారు.
Read also : ఓటు హక్కు వినియోగించుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి
ఇసుక అక్రమాలపై ప్రశ్నించినా లేదా మద్యం అక్రమాలపై నిలదీసిన, నడిరోడ్డుపై చిత్రహింసలు పెట్టిన మీరు చివరికి మాస్కు అడిగినందుకుగాను దళిత డాక్టర్ సుధాకర్ను పిచ్చోడిని చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారని ధ్వజమెత్తారు. అమర్నాథ్ గౌడ్ లాంటి అమాయకులను తగలబెట్టేశారు. అందుకే ప్రజలందరూ కూడా అలాంటి పాలన వద్దని ఏకతాటిపై నిలబడి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజెపి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని తెలిపారు.
Read also : Gold Rate: మరోసారి భారీగా పెరిగిన ధరలు





