Youtuber Naa Anveshana Anvesh: నటుడు శివాజీ.. ‘దండోరా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆడవాళ్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి, నాగబాబు లాంటి వారు రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాదంలోకి తాజాగా యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్ అన్వేష్ ఎంట్రీ ఇచ్చాడు. శివాజీతో పాటు గరికపాటి నరసింహా రావుపై అసభ్యకర పదజాలంతో విరుచుకు పడ్డాడు. అక్కడితో ఆగకుండా హిందువులు దేవుళ్లుగా పూజించే సీతా దేవి, ద్రౌపదిపై అభ్యంతకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో అతనిని ఫాలో అయ్యేవారితో పాటు ఇంకా అనేక మంది తెలుగు ప్రజలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. ఆగ్రహావేశాలతో రగిలి పోతున్నారు.
స్పందించిన గరికపాటి టీమ్
అటు ఈ వివాదంపై గరికపాటి టీం స్పందించింది. తమ గురువు గారు ఎప్పుడో చెప్పిన మాటలను, ఫొటోలను ఇప్పటి సమస్యలకు జత చేసి అన్య పద్ధతుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారని ముఖ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇంతా జరుగుతున్నా నా అన్వేషణ ఇంకా భారత్ ను అవమానించేలా వీడియోలు పెడుతూ నేను ఇలానే రోజుకు 5 వీడియోలు పెడతా మీరెన్ని కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి నేను ఇలానే ఉంటా అంటూ రెచ్చగొడుతున్నాడు.
సగానికి తగ్గిన ఫాలోవర్స్
తాజాగా దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అట్టుడికి పోతున్నాయి. ఎవరైతే అతనిని ఫాలో అవుతున్నారో అంతా వెంటనే బయటకు రావాలని, అన్‌ఫాలో చేయాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఇన్ స్టా, యూట్యూబ్‌లలో మూడేసి మిలియన్లకు పైగా ఉన్న ఫాలోవర్లు క్రమంగా తగ్లుతూ 1 మిలియన్‌కు తగ్గింది. ఇప్పుడున్న సిట్యువేషన్ చూస్తుంటే రెండు రోజుల్లో వెయ్యి లోపు వచ్చేలా కనిపిస్తోంది.





