తెలంగాణవైరల్
Trending

ముందడుగు వేసిన యువత.. బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ ఫిర్యాదు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. బిగ్ బాస్ అనే రియాల్టీ షో ద్వారా సమాజానికి ఏం చెప్పబోతున్నారు అని ప్రశ్నించారు. ఒకవైపు సమాజానికి మరోవైపు ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇవ్వడం తప్ప బిగ్ బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని గజ్వేల్ కు చెందినటువంటి యువకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బిగ్ బాస్ షో నిర్వాహకులు సమాజం సిగ్గుపడే విధంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. బిగ్బాస్ షో లో కి కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో దాదాపు చాలా మందిపై కేసులు కూడా ఉన్నాయని.. స్పష్టం చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్తో షో నిర్వహిస్తున్నారు అని.. సమాజంలో విలువలు లేని వారిని ఎంపిక చేసి దానికి రియాల్టీ షో అని పేరు పెట్టడం ఏంటి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా బిగ్ బాస్ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అందరం కలిసి బిగ్ బాస్ హౌస్ ను ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత అంతా కూడా ఈ బిగ్ బాస్ షో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయట కొన్ని కేసులు నమోదు అయిన వారిని… తెలుగు మాట్లాడరానివారిని, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని, బూతులు తిడుతున్న వారిని హౌస్ లోకి పంపించడమేంటంటూ నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు కొంతమంది గజ్వేల్ యువకులు ఈ బిగ్ బాస్ షో పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చాలామంది కూడా వీరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నాళ్లకు ఒక మంచి పని చేశారు అని వీరిని ప్రశంసిస్తున్నారు. మరి ఈ యువత చేసిన పనిపై మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి.

Read also : మద్దూర్ సంఘం చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Read also : ఒకవైపు పెట్టుబడులు… మరోవైపు కొంతమందికి కడుపు మంట : నారా లోకేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button