Thursday, March 19, 2026
Homeతెలంగాణస్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి : సర్పంచ్ అద్దాల మహేందర్

స్వయం ఉపాధితో యువత ముందుకు సాగాలి : సర్పంచ్ అద్దాల మహేందర్

రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చరికొండ గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గజ్జె రమేష్ ఏర్పాటు చేసిన నూతన పంచర్ షాప్‌ను సర్పంచ్ అద్దాల మహేందర్ ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అద్దాల మహేందర్ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించే చిన్న వ్యాపారాల ద్వారా కూడా స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారాలు పెరిగితే స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.గజ్జె రమేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర యువతకు ఆదర్శంగా నిలుస్తుందని, తన వ్యాపారం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన పంచర్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు, రైతులకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ గోసుల వెంకటేష్ యాదవ్, యాతం వెంకటయ్య, సీత జంగయ్య, గుండం రాములు, హరిచంద్ర, లింగం, రాఘవేందర్, వార్డ్ మెంబర్ కరుణాకర్ మహేష్ అరవింద్, అనిల్ చారీ గ్రామ పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని రమేష్‌కు అభినందనలు తెలిపారు.

ఈసారి కప్పు బెంగళూరుదే.. ABD సంచలన వ్యాఖ్యలు!

Eggs Expiry Date: ఇక గుడ్లపైనా ఎక్స్‌ పైరీ డేట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments