
కోదాడ, క్రైమ్ మిర్రర్ :- అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ (35) తన స్నేహితులతో కలిసి మధ్యాహ్నం సుమారు 4:30 నిమిషాల ప్రాంతంలో పాలేరు వాగులో ఈత పందెం పెట్టుకొని వాగులోకి దూకారు. కాగా కిన్నెర ఉపేందర్ దివ్యంగుడు కావడంతో పాలేరు వాగు వరద ఉద్రిక్తకు గురై గల్లంతయ్యాడు యువకుడు స్నేహితుడు చింతరాల అర్జున్ ఒడ్డుకు చేరుకొని గల్లంతయిన ఉపేందర్ ను కాపాడేందుకు ప్రయత్నించగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానికులు యువకుడు కోసం గాలింపు చేపట్టినప్పటికీ, గల్లంతైన యువకుడు ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి యువకుడి కోసం ఎస్ క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
Read also : బిగ్ బాస్ లోబోకు సంవత్సరం జైలు శిక్ష!.. ఎందుకంటే?
Read also : మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాకు అలర్ట్!