
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడానికి మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా వాట్సాప్ అనే యాప్ ద్వారా మీసేవ సర్వీసులను ప్రారంభించారు. మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి మరీ మీసేవ సర్వీసులను ప్రారంభించడం జరిగింది. 8096958096 అనే ఈ నెంబర్ కు జస్ట్ Hi అని మెసేజ్ చేస్తే చాలు. మొత్తం 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 కి పైగా సర్వీసులను కేవలం ఈ మీసేవ వాట్సాప్ ద్వారానే పొందే అవకాశాలు ఉన్నాయి.
మీసేవ ద్వారా లభించే ముఖ్యమైన సర్వీసులు
1. బర్త్ సర్టిఫికేట్
2. ఇన్కమ్ సర్టిఫికేట్
3. క్యాస్ట్ సర్టిఫికేట్
4. డెత్
5. విద్యుత్
6. నీటి బిల్లులు
7. ఆస్తి పన్నులు
ఇలా ఎన్నో రకాల సర్వీసులను కేవలం వాట్సాప్ లో 8096958096 ఈ నెంబర్ కు hi మెసేజ్ చేసి పొందవచ్చు అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఏకంగా 580 కి పైగా సర్వీస్ లను ఇక్కడ ఉచితంగా పొందవచ్చు. కాబట్టి మొబైల్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ లను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఇక తెలియని వ్యక్తులకు కూడా ప్రతి ఒక్క అధికారి తెలిసేలా చేయాలి అని.. అన్ని గ్రూపులలో ఇవి ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సర్వీస్ లను ఉపయోగించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
Read also : Pet Love: మరీ ఇంత ప్రేమనా.. కుక్కకు శ్రీమంతం!
Read also : Viral video: ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం.. మరీ ఇంత దారుణమా..?





