తెలంగాణరాజకీయం

నీ పెతాపమా.. నా పెతాపమా - సై అంటే సై అంటున్న కాంగ్రెస్‌, బీజేపీ

ఏఐసీసీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు రాజేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ ఘాటుగా నడుస్తోంది. మీరు తరిమికొట్టేదేంది మేమే ఆ పని చేస్తామంటూ కమలం పార్టీ నేతలు ముఖ్యమంత్రికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌లు ఇస్తున్నారు. నీ పెతాపమా నా పెతాపమా చూసుకుందాం అన్న రేంజ్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. ఆ పొలిటికల్‌ ఫైట్‌ ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం…!

బ్రిటీషర్ల కంటే బీజేపీనే డేంజర్‌ అంటూ ఘాటుగా విమర్శించారు సీఎం రేవంత్‌రెడ్డి. బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని సవాల్‌ చేశారాయన. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జాతిపిత గాంధీజీ స్వాతంత్ర్య సమరం చేశారని… అయినా గాంధీజీపై బ్రిటీషర్లు చేయి కూడా వేయలేదన్నారు. కానీ  స్వాతంత్ర్యం వచ్చిన ఆరు నెలలు కూడా గాంధీజీని భరించలేకపోయారని ఆయనపై బుల్లెట్‌ పేల్చారని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మోడీని గాడ్సే పరివారమని విమర్శించారు.

రాబోయే ఎన్నికలు గాంధీ పరివారం – గాడ్సే పరివారం మధ్యే జరుగుతాయన్నారు. గాంధీ పరివారమంతా కలిసి కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో మాత్రం బీజేపీని అడుగుపెట్టనివ్వమని ఖరాఖండీగా చెప్పేశారాయ. దీంతో తెలంగాణ బీజేపీ నేతలంతా సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. మాటల తూటాలు పేల్చుస్తున్నారు.


Also Read : బీజేపీతో కలిసి రేవంత్‌రెడ్డి భారీ స్కామ్‌ – త్వరలో పేలనున్న పొలిటికల్‌ బాంబ్‌ ఇదేనా..!


తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమన్న సీఎం రేవంత్‌రెడ్డికి ఘాటుగా కౌంటర్‌ ఇస్తున్నారు కమలం పార్టీ నేతలు. రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. కాంగ్రెస్‌ అంతరించిపోయే పార్టీ అని ఎద్దేవా చేశారాయన. బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌ వెళ్లి తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని చెప్పడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. ఇటు ఎంపీ రఘునందన్‌ కూడా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు గట్టి రిప్లై ఇచ్చారు. బీజేపీని ఆయన అడుగుపెట్టనిచ్చేది ఏందని కాంగ్రెస్‌లో చివరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అని అన్నారు రఘునందన్‌. వచ్చే 20ఏళ్లు కాంగ్రెస్‌కు తెలంగాణలో స్థానం లేదంటూ కౌంటర్‌ అటాక్‌ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం తారాస్థాయిలో ఉంది ఈ పొలిటికల్‌ ఫైట్‌ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి .. 

  1. జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్‌..!

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button