
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026 కు సంబంధించి అబుదాబిలో జరిగినటువంటి మినీ వేలంలో ఎన్నో వింతలు చూసాము. ప్రతి ఒక్కరూ అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్రీన్ అత్యధిక ధర పలికాడు. 25.20 కోట్లతో గ్రీన్, 18 కోట్లతో పతి రాణా ను కేకేఆర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే మరోవైపు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి యంగ్ ప్లేయర్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. డొమెస్టిక్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ ను ఏకంగా 14 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేశారు.
Read also : తెలంగాణలో ముగిసిన “పంచాయితీ”.. పూర్తి వివరాలు ఇవే?
అయితే తాజాగా యంగ్ ప్లేయర్లను ఇంత డబ్బు పెట్టి కొనడం వెనుక కారణమేంటి అని చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వేళ సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ వీర్ చాలా టాలెంటెడ్ క్రికెటర్ అని.. ప్రస్తుత రోజుల్లో యంగ్ టాలెంట్ టీంకు చాలా అవసరం అని అన్నారు. భవిష్యత్తు రోజుల్లో క్రికెట్ తీరు మారుతున్న సందర్భంలో ఇలాంటి యువ ప్లేయర్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా రాణించగల భావనతోనే గతంలో ఆయుష్ మాత్రే, బ్రేవిస్ మరియు ఊర్విల్ పటేల్ వంటి యంగ్ స్టార్ లను తీసుకున్నామని చెప్పారు. యంగ్ ప్లేయర్లతో ఈ సీజన్ చాలా బెటర్ గా ఉండబోతుంది అని తెలిపారు.
Read also : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ AI వీడియో.. అభిమానుల రియాక్షన్ ఇదే?





