మలయాళ నటి ప్రజ్ఞ నగ్ర ప్రయివేట్ వీడియో లీక అయ్యిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై శనివారం నటి ప్రజ్ఞ సోషల్ మీడియాలో (Pragna Nagra) tweet link స్పందించింది.
తన ప్రయివేట్ వీడియో లీక్ అయ్యిందని వైరల్ అవుతున్న వార్తల గురించి తెలిసిన తర్వాత బాధ కలిగిందని తెలిపింది. అయితే ఇదొక పీడకలగా భావిస్తూ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. టెక్నాలజీ అనేది ఉపయోగ పడటానికి క్రియేట్ చేసిందని కానీ ఇది జీవితాలను దుర్భరంగా మార్చకూడదని అభిప్రాయం వ్యక్తం, చేసింది.
అలాగే AI ని ఉపయోగించి తనఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియోలు షేర్ చేసిన వారిపై జాలి కలుగుతోందని వెల్లడించింది. ఏదేమైనప్పటికీ వీటన్నింటిలో బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని అలాగే ఈ కష్ట కాలంలో నాకు సపోర్ట్ చూసినవాళ్లందరికీ థాంక్స్ తెలిపింది. మరెవ్వరికీ ఇలాంటి కష్టాలు రాకూడదని, మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేసింది. ట్వీట్ లో సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ట్యాగ్ చేసింది.
అయితే హర్యానాకి చెందిన ప్రజ్ఞ కి యాక్టింగ్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో కొంతకాలంపాటు మోడలింగ్ లో కూడా చేసింది. ఆ తర్వాత మలయాళంలో 2022లో వరలారు ముక్కియం అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత ఎన్ 4(తమిళ్), నధికళిల్ సుందరి (మలయాళం) తదితర సినిమాల్లో నటించింది.
రీసెంట్ గా టాలీవుడ్ పై ద్రుష్టి సారించింది. ఈ క్రమంలో లగ్గం అనే తెలుగు సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ ప్రజ్ఞ యాక్టింగ్ స్కిల్స్ కిమంచి మార్కులే పడ్డాయి. దీంతో టాలీవుడ్ బానే ఆఫర్లు వరిస్తున్నట్లు సమాచారం.