
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమిండియా యంగ్ క్రికెటర్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ తాజాగా ఆసుపత్రిలో చేరారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరుపున ఆడుతున్నటువంటి జైస్వాల్ రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా నిన్న మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. ఇక వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరగా పక్కనే ఉన్నటువంటి సిబ్బంది అతనిని వెంటనే పూణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. ఇక వెంటనే జైష్వాలను పరిశీలించినటువంటి వైద్యులు అతడు పూర్తిగా గ్యాస్ట్రో సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు అని.. దానికి తగ్గ వైద్య పరీక్షలు నిర్వహించే ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
Read also : దారుణం.. భార్య, ఇద్దరు బిడ్డలను చంపేశాడు!
ఈ విషయాన్ని తాజాగా క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా నిన్న రాజస్థాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో ముంబై జట్టు మూడు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. అనంతరమే యశస్వి జైస్వాల్ ఆసుపత్రిలో చేరడం ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయం తెలియగానే మొదటగా జైస్వాల్ అభిమానులు కాస్త కంగారుపడగా తాజాగా అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది అని క్రీడా వర్గాలు పేర్కొనడంతో కుదుటపడ్డారు. కాగా ఈ మధ్య అంతర్జాతీయ టి20 జట్టులోకీ జైస్వాల్ ను సెలెక్ట్ చేయాలి అని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Read also : Gold Prices: బంగారం కొనడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదు.. వెళ్లండి.. వెళ్లి వెంటనే కొనేసేయండి!





