
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. గత ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు కూడా రోజు మార్చి రోజు లేదా ప్రతిరోజు అన్నిచోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వర్షాల ప్రభావంతో ఎంతోమంది పలు రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు నష్టం కూడా చెందారు. తెలంగాణలో అయితే భారీ వర్షాలు ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ పై వరుణుడు విరుచుకుపడుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొద్దిరోజుల నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అలా వర్షం పడిన క్షణాల్లోనే రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాహనదారులైతే రోడ్లపైకి రావాలంటేనే ఏంటి ఈ పరిస్థితి అని తలబాదుకుంటున్నారు. గంట లేదా అరగంట వర్షం పడిన వెంటనే రోడ్లు జలమయం అవుతున్నాయని.. సరైన డ్రైనేజీ సిస్టం కూడా లేదని వాహనదారులు మండిపడుతున్నారు.
ఇక ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాన దంచి కొడుతుంది. మరికొన్ని జిల్లాలలో కొద్దిసేపటి తర్వాత వర్షాలు పడతాయని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చెప్పుకొచ్చింది. నేడు..
మేడ్చల్
వరంగల్
అదిలాబాద్
హనుమకొండ
సూర్యపేట
మహబూబాబాద్
నిర్మల్
ఈ ఏడు జిల్లాలలో రాబోయే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న, నేడు, రేపు కూడా అన్ని జిల్లాల్లో పలు ప్రాంతాలలో.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతిసారి ఎండలు కారణంగా వర్షాలు ఎప్పుడు పడతాయని ప్రజలు కోరుకునేవారు. కానీ ఈసారి మాత్రం వర్షాలు పడకుండా ఉంటేనే బాగుంటుందనే ఆందోళనలో ఉన్నారు.
Read also : బతుకమ్మ పండుగ వేళ… గుండెపోటుతో ఇద్దరు మహిళలు మృతి!
Read also : నేటికీ 47 ఏళ్ళు… చిరు స్పెషల్ ట్వీట్!