
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లను ఏఐ జనరేటెడ్ ఫోటోలు బాధ పెట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లను కొంతమంది ఏఐ ను ఉపయోగించి అసభ్యకరంగా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లు ఈ అసభ్యకరమైన ఫోటోలు తయారు చేయడం వల్ల చాలా బాధపడుతున్నామని సోషల్ మీడియా వేదికగా తమ బాధను పంచుకున్నారు. అయితే తాజాగా హీరోయిన్ నివేదా థామస్ ఫోటోలను కూడా అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలను చూసి నేనే షాక్ అయ్యాను అంటూ.. అలాంటి ఫొటోలను క్రియేట్ చేయడం వల్ల మీకు ఏం లాభం వస్తుందో తెలియదు కానీ నేను మా ఫ్యామిలీ మాత్రం చాలా బాధపడతామంటూ పేర్కొన్నారు.
Read also : Social Media: సోషల్ మీడియాలో పరిచయమైన అబ్బాయి కోసం ఇల్లు వదిలేసిన అమ్మాయి
వీటిని పోస్ట్ చేసిన వారు దయచేసి వెంటనే తొలగించాలి అని లేదంటే కచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు . మరోవైపు హీరోయిన్ శ్రీ లీల ఫోటోలను కూడా తాజాగా బాత్రూంలో అసభ్యకరంగా ఉన్నట్లు ఎడిట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా శీలీలకు మద్దతుగా నిలవడంతో ఆమె ప్రత్యేకంగా వారందరికీ అలాగే అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేదంటే రాను రాను మరింత మంది హీరోయిన్లు వీటికి బలైపోతారు అని అన్నారు. కాగా ఈ మధ్యకాలంలోనే ఎంతోమంది తెలుగు సినిమా హీరోయిన్ల ఫోటోలను మార్పు చేసిన విషయం మా అందరికి తెలిసిందే.
Read also : వారణాసి పై కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..?





