
చండూరు, క్రైమ్ మిర్రర్:- మునుగోడు నియోజకవర్గం లో తన రీ ఎంట్రీ నిజమే అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చల్లమల కృష్ణారెడ్డి తెలిపారు. ఆయన క్రైమ్ మిర్రర్ ప్రతినిధితో మాట్లాడారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ పెద్దలను గౌరవించకుండా రివర్స్ అయ్యారు కాబట్టే తాను ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించకుండా తన వెంట పార్టీలను మార్చే కార్యకర్తలకు, నాయకులకే ప్రాధాన్యమిస్తున్నారని. డబ్బున్న వారినే దగ్గరికి తీస్తున్నారని ఆరోపించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లభించాలని అన్నారు. నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాల్సింది పోయి… మంత్రి పదవి ద్యాస లో పడి నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. కేవలం సమీక్షలు చేస్తూ తన కార్యకర్తలతో పర్యటనలు మాత్రమే చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ జెండాను కింద పడేసి వెళ్లినప్పుడు తానే ఆ జెండాను మోశానని తెలిపారు. మునుగోడు బిడ్డగా ఈ ప్రాంతంలో తాను తిరిగేందుకు అన్ని రకాలుగా ఆస్కారం ఉందన్నారు. ఇది ఇలా ఉండగా ఈయన ములుగు నియోజకవర్గంలో తిరగడం పట్ల రేవంత్ రెడ్డి హస్తం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
Read also : పులివెందుల గడ్డ.. ఇప్పుడు టీడీపీ అడ్డా!.. షాక్ లో వైసీపీ?
Read also : కాంగ్రెస్ పార్టీలో చేరిన మధుసూదనుడు!