ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్‌ – గవర్నర్‌ ప్రసంగంపై నిరసన-ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌

వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కూడా ఎదుర్కొనే సత్తా... అధికార పార్టీకి లేదా అని వైసీపీ ప్రశ్నించింది. 11 మంది వేసే ప్రశ్నలకు... అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమాధాలు చెప్పలేరా అని నిలదీశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు వాడీవేడిగా జరిగాయి. వైసీపీ సభకు రావడమే కాదు… ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేసింది. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి… ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటూ సభలో నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టారు. ఆ తర్వాత.. గవర్నర్‌ ప్రసంగానికి నిరసన తెలుపుతూ… వాకౌట్‌ చేశారు.

ఏపీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజే సభలో గందరగోళం నెలకొంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తోపాటు ఆ పార్టీ సభ్యులంతా సభకు హాజరయ్యారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుండగా… వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. 10 నిమిషాల పాటు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పక్షాలని… అవి ఒకటి అధికార పక్షం… రెండో ప్రతిపక్షమని అన్నారు. అలాంటప్పుడు తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు సమస్య ఏంటని ప్రశ్నించారు. 10 నిమిషాల పాటు నినాదాలు చేసి… వైఎస్‌ జగన్‌తోపాటు వైసీపీ సభ్యులంతా వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు.

అసెంబ్లీ ప్రజా సమస్యలపై ప్రశ్నించాలంటే ప్రతిపక్షా హోదా కావాలని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కూడా ఎదుర్కొనే సత్తా… అధికార పార్టీకి లేదా అని వైసీపీ ప్రశ్నించింది. 11 మంది వేసే ప్రశ్నలకు… అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమాధాలు చెప్పలేరా అని నిలదీశారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ బయటపడుతుందని… అక్రమాలపై నిలదీస్తామని… వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ అధికార పక్షం వైపు మాత్రమే కాదు… ప్రతిపక్షం వైపు కూడా నిలబడాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే… మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు తగిన సమయం ఉంటుందన్నారు.

వైసీపీ వాదనను అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తున్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే… సభ్యత్వం రద్దు చేస్తారనే భయంతోనే వైఎస్‌ జగన్ సభకు వచ్చారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే అని.. ప్రతిపక్ష నాయకుడు కాదని అంటున్నారు. సభకు వచ్చి సంతకం పెట్టిపోవడం కాదని… రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని అంటున్నారు. మరోవైపు…. గవర్నర్‌ ప్రసంగం తర్వాత… ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి.. 

  1. వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది .. స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.. గవర్నర్‌ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే.

  2. జగన్, రోజాలా బూతులొద్దు.. ఎమ్మెల్యేలకు పవన్ హితవు

  3. 50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?

  4. రోజులు గడుస్తున్నాయ్‌…ఆశలు సన్నగిల్లుతున్నాయ్‌…ఆ 8మంది జాడేది..? 

  5. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button