
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ మాజీ మంత్రి జోగీ రమేష్ కొద్దిసేపటి క్రితం అరెస్టు అయిన విషయం ప్రతి ఒక్కరికి ఇచ్చిందే. అయితే జోగి రమేష్ అరెస్ట్ ను వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వానికి బీసీలు అంటే ఎందుకు ఇంత కడుపు మంట అని ప్రశ్నిస్తూనే సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నారు. దాంతో పాటు జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి వీడియోలను వైసీపీ అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయుడు శాడిస్ట్ అంటూ.. టటీడీపీ యాంటీ బీసీ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.
Read also : T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ మామ.. రీజన్ ఇదే?
కాగా కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ అరెస్టు అయ్యారు. ఇవాళ ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్లినటువంటి ఎక్సైజ్ అధికారులు మొదట నోటీసులు ఇచ్చి ఆ తరువాత ఏ-1 జనార్ధన్ రావు వాంగ్మూలం ప్రకారమే అరెస్టు చేస్తున్నామని అధికారులు అన్నారు. మరోవైపు తనను ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితమే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద చేతిలో హారతి వెలిగించి మరి నేను ఎటువంటి తప్పు చేయలేదని జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. కానీ ఇంతలోనే జోగి రమేష్ అరెస్ట్ అవడం చక చక జరిగిపోయింది.
Read also : కెన్యాలో తీవ్ర విషాదం.. 21 మంది మృతి, 30 మంది గల్లంతు!





