
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనా..? జగన్ పార్టీ పుంజుకోవడం కల్లో మాటేనా..? వైసీపీ మళ్లీ పైకి లేచే ప్రయత్నం చేయకుండా టీడీపీ చక్రవ్యూహం పన్నిందా…? దెబ్బమీద దెబ్బ కొడుతూ… చతికిలపడే స్టేజ్‌కి తీసుకురాబోతోందా…? మరి… టీడీపీ పన్నిన ఈ చక్రవ్యూహాన్ని జగన్ పార్టీ ఛేదిస్తుందా…? ఏపీ రాజకీయాల్లో ఈ తరహా చర్చ జరగడం ఆసక్తి రేపుతోంది.
2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారంలో వచ్చింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్. అత్యధిక జనాదరణ పొందిన పార్టీగా పేరు కూడా తెచ్చుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక వెలుగు వెలిగింది. తన హయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ.. ఎన్ని కష్టాలు వచ్చినా తూచా తప్పకుండా అమలు చేశారు వైఎస్ జగన్. అయినా… 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర ఓటమి తప్పలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా… వచ్చే ఎన్నికల్లో గెలవచ్చు. అయితే… ఇక్కడే టీడీపీ రాజకీయంగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం. వైసీపీ మళ్లీ కోలుకోకుండా… దెబ్బమీద దెబ్బ కొడుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న అధికార పార్టీ.. ఆ అవినీతి చిట్టాను బయటకు తీసి ఆ పార్టీని ఖేల్ ఖతం చేయాలని చూస్తోంది.
Also Read : వైసిపి పార్టీ బలపడాలంటే జగన్ ఇవి చేయాల్సిందే?.
ముందు వైసీపీ నేతలను టీడీపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ పార్టీలో గట్టిగా మాట్లాడే నేతలంతా.. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఉన్న వాళ్లకూ ఇబ్బందులు తప్పడంలేదు. ఒక సమస్య తీరిందని అనుకునేలోపు… మరో సమస్య వచ్చి పడుతోంది. ఈ పరిస్థితి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని, అధినేత వైఎస్ జగన్‌ను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్… ఇది వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టి… ఆ పార్టీని బద్నాం చేసి… ప్రజల్లో ఆదరణ తగ్గింది… అసలు వైసీపీనే లేకుండా చేయాలని టీడీపీ ప్లాన్ అన్న చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే…. వైసీపీ పరిస్థితి అగమ్యగోచరమే. ఇక… ఆ పార్టీ పుంజుకునే పరిస్థితే ఉండదు.
Also Read : వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులు వేలం – 310 కోట్లు జప్తు..!
వాస్తవానికి… ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్న టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగాలి. అయితే… ఈ పరిస్థితి రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు కంటే… వైసీపీ అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలపైనే ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగేలా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు… ఒకవైపు వైసీపీని దెబ్బకొడుతూ… మరోవైపు నెమ్మదిగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి.. ప్రజల మన్ననలు పొందాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే… వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి నిరాశ తప్పదు. కనుక… వైఎస్ జగన్ టీడీపీ పన్నుతున్న చక్రవ్యూహాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
కేటీఆర్ త్వరగా కోలుకోవాలని అంటున్న… లోకేష్, పవన్ కళ్యాణ్
-
నర్సాపూర్ లొ కింగ్ ఫిషర్ బీర్ల కృతిమ కొరత..బెల్టు షాపుల్లో ఫుల్ స్టాక్..! వైన్ షాపుల్లో నో స్టాక్.
-
తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు… వాస్తవం బయటపెట్టిన జగ్గారెడ్డి
-
కేబినెట్ విస్తరణపై నిర్ణయం రేవంత్ రెడ్డిదే – పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన అధిష్టానం
-
బిగ్ బ్రేకింగ్.. థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..