
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వైసీపీ మాజీ నేత విజయ్ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డి నేడు వైసిపి పార్టీకి రాజీనామా చేశారు. వైసిపి పార్టీకి విజయసాయిరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారు అప్పటినుంచి ప్రతి ఒక్కరూ పది రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి మధ్య ఏం జరిగిందంటూ చాలామంది చర్చించారు. అయితే తాజాగా విజయ్ సాయి రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకువెళ్తారు’. కోటరీ మాటలు వినోద్ అని జగన్కు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫలితం లేకపోవడంతో వైసీపీ నుంచి తొలగిపోయాను అంటూ విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. చెప్పుడు మాటలను నాయకుడు ఎప్పుడు కూడా వినకూడదు అని అన్నారు. తద్వారా నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్ళీ అతుక్కోదని వైసిపి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకొని ఈ మాట అన్నారు. తిరిగి మళ్లీ వైయస్సార్సీపి పార్టీలో చేరే ప్రసక్తే లేదు అని విజయ్ సాయి రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు.
అయితే జగన్మోహన్ రెడ్డి పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై… వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విజయ్ సాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో అంటూ.. ఒకరిపై ప్రేమ పుడితేనే మరోపరిపై మనసు విరుగుతుంది అని విజయ్ సాయి రెడ్డిని దూషించారు. జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే విజయసాయిరెడ్డి ఇలా మాట్లాడేవారా?… విజయ్ సాయి వ్యవసాయం చేయరని, కేవలం రాజకీయం మాత్రమే చేస్తారని ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుందని… గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.
ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్
పరీక్ష రాస్తుండగా ఫ్యాన్ ఊడి పడి ఇంటర్ విద్యార్థినికి గాయాలు