కళాకారుల బృందాలతో, డప్పు చప్పుళ్లతో ఊరంతా దద్దరిల్లిపోయింది
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- మండలంలోని యరుగండ్లపల్లి సర్పంచ్ ల ఎన్నికలు, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మారుమోగాయి.. మునుగోడు నియోజకవర్గ స్థాయిలో, జోరును తలపించిన యరుగండ్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో, అసలైన ఫలితాలను ఇచ్చి ప్రజా నాయకుడుకి పట్టం కట్టింది.
నిత్యం ప్రజల్లో మెదిలే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వల్లంల సంతోష్ కు ప్రజలు సర్పంచ్ బాధ్యతలు అప్పజెప్పారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడే, సంతోష్ యాదవ్ కు జనం నీరాజనాలు పడుతున్నారు. నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే సంతోష్ యాదవ్, ప్రమాణ స్వీకారాన్ని గ్రామ ప్రజలు సంభరంలా జరుపుకుంటున్నారు.
కళాకారుల బృందాలతో, డప్పు చప్పుళ్లతో ఊరంతా దద్దరిల్లిపోయింది. బిఆర్ఎస్ పార్టీ పాటలతో, కళాకారుల నృత్యాలతో ఆనందాల మధ్య సంతోష్ యాదవ్ ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. స్థానికుడైన సంతోష్ కి పట్టం కట్టి, ప్రజలు తమ బాధ్యతను పూర్తి చేశారు.
గ్రామ అభివృద్ధితో యరుగండ్లపల్లిని జాతీయ స్థాయిలో నిలపాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజల కోరికే సంతోష్ మదిలో మెదులుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషికై, ఇప్పటికే ప్రణాళికలు వేశారు సంతోష్ యాదవ్. వల్లంల గెలుపును గ్రామం మొత్తం పండగలా జరుపుకుంటున్నారు..





