తెలంగాణ

టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట బోర్డు - తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందు కోసం ఎండోమెంట్‌ చట్ట సవరణకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం.

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముసాయిదా బిల్లును ఫైనల్‌ చేయాలన్నారు. లేదంటే లీగల్‌ సమస్యలు వస్తాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూడాలని కేబినెట్‌ మీటింగ్‌లో చెప్పారు. తెలంగాణలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీరికి ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాల్లో 15 శాతం రిజర్వేషన్‌ ఉంది. అయితే… ఆ జాబితాలో కులాల మధ్య అసమానతలు కూడా ఉన్నాయి. దీని వల్ల వచ్చిన రిజర్వేషన్లను కొన్ని కులాలే ఉపయోగించుకుంటున్నాయి. మిగిలిన వారు వెనుకబడే ఉన్నారు. అందుకే… ఎస్సీలకు ఇచ్చే 15 శాతం రిజర్వేషన్లను… వారి కులాల మధ్య విభజించి పంచాలనే డిమాండ్‌ వచ్చింది. ఆ పోరాటం ఇప్పటికి ఫలించింది. ఎస్పీ వర్గీకరన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలపడంతోపాటు… లీగల్‌ సమస్యలు రాకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇక… బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఆమోదముద్ర వేసింది.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం, హెచ్‌ఎండీఏ (HMDA) విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే… రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించాలని నిర్ణయించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్‌ తెలంగాణగా, అక్కడి నుంచి RRR రోడ్డుకు రెండు కిలోమీటర్ల అవతల ఉన్న బఫర్‌ జోన్‌ వరకు ఫ్యూచర్‌ సిటీగా, మిగిలిన ప్రాంతాన్నిరూరల్‌ తెలంగాణగా చేయబోతున్నారు. ఇక.. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా… ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్‌-2025 పాలసీకి కూడా ఆమోదం తెలిపింది కేబినెట్‌. మహిళా సంఘాలు అన్నింటిని.. ఒక్క దగ్గర చేర్చబోతున్నారు. తెలంగాణ టూరిజం పాలసీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

డీలిమిటేషన్‌పై కూడా తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరిగింది. పార్లమెంట్‌ పునర్విభజనలో దక్షిణాదికి నష్టం జరగకుండా… పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అందు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి …

  1. జానారెడ్డికి కీలక పదవి.. కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్

  2. కాంగ్రెస్ లౌడల పార్టీ.. మరోసారి నోరు జారిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

  3. మహిళా పోలీస్ అధికారులతోనే మోడీకి భద్రత!… ఉమెన్స్ డే స్పెషల్.. ఇలాంటి డేరింగ్ ఏ దేశంలోనూ చేయరు?

  4. భర్తతో విభేదాలు లేవన్న సింగర్‌ కల్పన – ఆత్మహత్యాయత్నం చేయలేదంటూ వీడియో రిలీజ్‌

  5. టీడీపీ-జనసేన మధ్య గ్యాప్‌ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button