
సంస్థాన్ నారాయణపుర్, మార్చి 17(క్రైమ్ మిర్రర్):- యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండలంలోని కంకణాల గూడెం గ్రామపంచాయతీ శేరిగూడెం గ్రామంలో భరత్ చంద్ర చారి ఇంటిని సోమవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కె. హనుమంతరావు సందర్శించడం జరిగింది. అనంతరం భరత్ చంద్ర చదువు విషయాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఇంటి పోషణకు సంబంధించిన సరుకులను అందజేశారు.జీవితంలో స్థిరపడే వరకు ఆయన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. 10వ తరగతిలో కష్టపడి చదివి జీవితంలో తొలిమెట్టుగా విజయం సాధించాలని తల్లిదండ్రులకు గురువులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తల్లి విజయలక్ష్మి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మద్దూర్ లో అందుబాటులో లేని వెటర్నరీ డాక్టర్ సిబ్బంది!..
In Telangana : రెండోసారి కూడా నేనే సీఎం – రేవంత్‌రెడ్డిది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..?