
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రపంచ కుబేరులలో ఒకరైన అనిల్ అంబానీ కి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు కూడా కోట్ల రూపాయలలో ఆదాయం కూడా వస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులపై నెటిజనులు సైతం బిత్తర పోయి నోరెళ్ళపెడుతున్నారు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్.. ఇది ప్రముఖ నగరం ముంబైలో ఉంది. ఈ స్కూల్ లో ఫీజులను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఫీజు ఉండడం.. అవి కూడా ప్రతి ఒక్కరూ ఊహించినటువంటి ఫీజులు ఉండడంతో అందరూ కూడా షాక్ అవుతున్నారు.
ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు :-
కిండర్ గార్డెన్ నుంచి ఏడో తరగతి వరకు : 1.70 లక్షలు
2. 8-10th (ICSE) : 1.85 లక్షలు
3. 8-10th (IGCSE) : 5.9 లక్షలు
4. 11-12th(IBDP) : 9.65 లక్షలు
ఇలా కిండర్ గార్డెన్ నుంచి ఇంటర్ వరకు కూడా ఫీజులు లక్షల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రముఖ వ్యక్తులు మరియు సెలబ్రిటీల పిల్లలు ఎక్కువగా చదువుతుంటారు. కాబట్టి వారికి డబ్బులు విషయంలో ఏ లోటు ఉండదు. అలాగే ఈ ఫీజులు చూస్తే సామాన్య ప్రజలు షాక్ అవుతారేమో కానీ సెలబ్రిటీలు మాత్రం ఎందుకు షాక్ అవుతారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇదే స్కూల్లో షారుక్ ఖాన్, కరీనాకపూర్ మరియు ఐశ్వర్యరాయ్ వంటి ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు ఇక్కడే చదువుతున్నారు.
Read also : గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి : సీఎం
Read also : Oats: మీరు టిఫిన్‌లో రోజూ ఓట్స్ తీసుకుంటున్నారా?





