
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ -2026 కు సంబంధించి ఇప్పటికే ఆయా జట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక రెండు వారాలలో జరగబోయేటువంటి మినీ యాక్షన్ తరువాత పూర్తిస్థాయిలో జట్టు వివరాలు తెలిసిపోతాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు అని ఒక వైపు ప్లేయర్స్ తో పాటు మరోవైపు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఆ జట్టు యువ ప్లేయర్ రియాన్ పరాగ్ కెప్టెన్సీకి నేను సిద్ధమని అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే పక్కా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అని పరాగ్ వెల్లడించారు. ఎందుకంటే గతేడాది సీజన్ లో దాదాపు 7 నుంచి 8 మ్యాచుల వరకు జట్టుకు కెప్టెన్సీ గా వ్యవహరించాను. 90 శాతం వరకు కూడా జట్టుకు తగ్గ సరైన నిర్ణయాలు తీసుకున్నాను అని వెల్లడించారు. ఇక మినీ యాక్షన్ తరువాత కెప్టెన్ ఎవరు అనేది జట్టు యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంటుంది అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా రియాన్ పరాగ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు సాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రేడ్ అవడంతో ప్రస్తుతం రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ ఎవరని చర్చ సోషల్ మీడియా వేదికగా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రేస్ లో రాజస్థాన్ జట్టు నుంచి జైశ్వాల్ మరియు జూరెల్ లాంటి యువ ప్లేయర్లు రేసులో ఉన్నారు. మరి రాజస్థాన్ జుట్టు ఎవరిని కెప్టెన్గా నియమిస్తుంది అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.
Read also : Good News: జస్ట్ రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్
Read also : ఓపెనర్ గా గిల్ ను మర్చిపోయిన అశ్విన్.. సారీ!





