
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
చండూరు, క్రైమ్ మిర్రర్: శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం లో శనివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు చేసిన చండూర్ మున్సిపాలిటీ అంగడిపేట మాజీ సర్పంచ్ నల్లగంటి మల్లేశం, కాంగ్రెస్ నాయకులు గండూరి జనార్ధన్, కురుమ సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు అందిర్కరాజశేఖరులు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ప్రదర్శించి ప్రత్యేక మొక్కులు మొక్కారు. మానవతావాదిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. మంత్రి పదవి రాగానే మళ్లీ వచ్చి మొక్కలు చెల్లించుకుంటామని తెలిపారు.
టీడీపీకి కొరకరాని కొయ్యలా కొలికపూడి – వాట్ నెక్ట్స్..!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం… కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్