
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలతో దూసుకుపోతుంది. ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ రికార్డ్ సృష్టించిన మూవీ గా నిలిచింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమా 1871 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ పోస్టర్స్ కూడా చాలా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ తీరాకేక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఇంకా ఆడుతూనే ఉంది. నెట్ఫ్లిక్స్ లోను అదరగొడుతూ ఈ సినిమా భారీ రికార్డును సృష్టిస్తుంది.
వంశీని కక్షపూరితంగానే టార్గెట్ చేశారు : వైఎస్ జగన్
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ సినిమా మొదటి భాగం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించిన రెండో పార్ట్ మాత్రం ఏకంగా ప్రపంచం అంతట కూడా భారీ కలెక్షన్లను రాబడుతూ రికార్డు సృష్టిస్తుంది. ఒకవైపు డైరెక్టర్ సుకుమార్ అలాగే హీరో అల్లు అర్జున్ కెరీర్ లోని ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో దేశవ్యాప్తంగా చాలా మంది నటీనటులు నటించారు. ఇక హీరోయిన్గా శ్రీవల్లి ఈ సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయిందని అనడంలో ఎటువంటి సందేహాలు లేవు. సినిమాలోని ఐటెం సాంగ్ లు శ్రీ లీల ఇరగదీసిన విషయం మనందరికీ తెలిసిందే.