క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను అని.. అలా ఆలోచించకపోతే ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగలను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అను సామర్ధ్యాల విషయంలో అమెరికా నెంబర్ 1 స్థానం లో ఉంది అని మరోసారి పేర్కొన్నారు. మా దగ్గర కావాల్సిన అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం మా దగ్గర ఉన్నటువంటి అన్వాయుదాలతో ఏకంగా ప్రపంచాన్నే 150 సార్లు వరకు పేల్చగలమని వెల్లడించారు. కానీ అటువంటి అవసరం, కక్షలు మాకు లేవు అని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అన్వాయిదాల విషయంపై పుతిన్ మరియు జిన్ పింగ్ తో ఎన్నోసార్లు చర్చించాను అని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అన్వాయుధాల కోసం ఉపయోగించినటువంటి డబ్బు మొత్తాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలని అనుకుంటున్నారంటూ తెలిపారు. కాబట్టి నేను కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను.. దయచేసి అందరూ కూడా ఇలానే ఆలోచించండి అని సూచించారు. ఒకవైపు శాంతిని కోరమని చెబుతూనే.. మరోవైపు అను సామర్థ్యాల విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది అని ఇతర దేశాలకు హెచ్చరికలు పంపిస్తున్నారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ అసలు ఏం మాట్లాడుతున్నారు.. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని కూడా అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Read also : రేపు స్కూళ్లకు వెళ్లాల్సిందే.. డీఈవోలు ఆర్డర్!
Read also : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం!





