
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత జట్టులోని కొంతమంది మహిళల తలరాతలు మారిపోయాయి. విజయం పొందినప్పటి నుంచి జట్టులో ఉన్నటువంటి ప్రతి మహిళా సభ్యురాలికి ఎంపీటీసీ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ మరియు ఫైనల్ మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినటువంటి జమీమాకి అలాగే వర్మ కు బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరిగిపోయింది అని సమాచారం. వీళ్ళిద్దరి బ్రాండ్ వ్యాల్యూ రెండు నుంచి మూడు రెట్లు పెరిగినట్లు కార్పోరేట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. జమీమా 60 లక్షల నుంచి కోటిన్నర వరకు తన బ్రాండ్ వ్యాల్యూ పెరగా.. మరోవైపు శపాలి వర్మ 40 లక్షల నుంచి కోటి రూపాయల కేటగిరి వరకు వెళ్లినట్లు సమాచారం. ఇక మిగతా ప్లేయర్ లందరూ కూడా 25 నుంచి 55% వరకు పెరుగుతుందని అంచనా వేశారు. వివిధ రంగాలలో వీరితో ప్రచారం చేయించుకోవడానికి కార్పోరేట్ తో పాటు పలువురు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, ఆటోమొబైల్, బ్యాంకులు, విద్యాసంస్థలు మొదలగు ఎన్నో రంగాలలో వీరితో ప్రచారం చేయించుకునే అవకాశాలు మరింత పెరిగాయి. దీంతో లక్ అంటే మన మహిళలదే కదా అని ప్రతి ఒక్కరు కూడా ఆనంద పడుతున్నారు.
Read also : ఎర్రచందనం స్మగ్లింగ్ పై.. డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్!
Read also : ప్రచారానికి కొద్ది గంటల్లోనే తెరపడనుంది.. మరి నెగ్గేదెవరో?





