
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- వివిధ క్రీడా రంగాలలో భారత మహిళల జట్లు సత్తా చాటిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నవంబర్ నెలలో భారత మహిళల జట్లకు తిరుగులేకుండా పూర్తిగా డామినేట్ చేశారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వేదికలపై భారతనారీమణులు అదరగొట్టేస్తున్నారు. వీళ్ళ గెలుపు ప్రతి ఒక్క సామాన్య మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ రెండవ తేదీన భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత నవంబర్ 23వ తేదీన అందుల మహిళల టీం టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. ఇక నిన్న జరిగినటువంటి ఉమెన ఇన్ బ్లూ కాబ్బడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోను భారత్ ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం ఈ నవంబర్ నెలలోనే మహిళలు మూడు ప్రపంచ వేదికలపై అదరగొట్టడంతో పాటు మన ఇండియన్ పవర్ అంటే ఏంటో చూపించారు. ఈ విజయాలతో క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు మరిన్ని సాధారణ కుటుంబాల నుంచి మహిళలు బయటకు వస్తారు అని.. ఇదే విజయోత్సవంతో మరిన్ని రంగాలలో మహిళలు రాణించాలి అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ నెలలో మహిళలు పూర్తిగా డామినేట్ చేశారు అని పలువురు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ప్రతి ఒక్క గెలుపు కూడా భారతదేశవ్యాప్తంగా ప్రతి ఒక్క అభిమాని తమ సోషల్ మీడియా ఎకౌంట్లో స్టేటస్ గా పెట్టుకుని అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలానే మన భారత మహిళలు మరియు పురుషులు అన్ని రంగాలలో డామినేట్ చేయాలని.. ప్రపంచం మొత్తం కూడా మన ఇండియా వైపు చూసేలా చేయాలి అని సూచిస్తున్నారు
Read also : క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. నేడే టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్!
Read also : Polished Rice: పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?





