
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:-మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది పండుగను పురస్కరించుకుని భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం బీ.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్స్ లో పని చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు సాగర్ కాంప్లెక్స్ కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో, హైదరాబాద్, తదతర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్లను, చీరలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని హామీనిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేయడం అభినందనీయమని మహిళా పారిశుద్ధ్య కార్మికులు అన్నారు.
భీష్మరాజ్ ఫౌండేషన్ సేవారంగంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ బి.బాలకృష్ణ, అధిక సంఖ్యలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.