శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. హైదరాబాద్ నుండి ముంబై వెళుతున్న ప్రయాణికురాలి వద్ద మూడు లైటర్లను స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ అధికారులు. మహిళ లైటర్లను లోదుస్తిలో అమర్చుకొని ప్రయాణిస్తుండగా గుర్తించారు సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు.
అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా లైటర్ ల గుట్టురట్టయింది. మహిళ వద్ద ఉన్న మూడు లైటర్ లను స్వాధీనం చేసుకుని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు మహిళలను ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. లైటర్లను ఎందుకు తీసుకెళుతున్నారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. మహిళా ప్రయాణికురాలి దగ్గర లైటర్లు దొరకడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.