
డెలివరీ బాయ్ అంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వస్తువులను సమయానికి కస్టమర్‌కు అందించడమే వారి బాధ్యతగా అందరూ భావిస్తారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన ఆ నిర్వచనాన్నే మార్చేసింది. కస్టమర్‌కు వస్తువులు ఇవ్వకుండా, ఆర్డర్‌ను రద్దు చేయించడమే కాకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన డెలివరీ బాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు.
View this post on Instagram
సమయం అర్ధరాత్రి. ఒక మహిళ మూడు ప్యాకెట్ల ఎలుకల మందును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వెళ్లిన బ్లింకిట్ డెలివరీ బాయ్ ఇంటి వద్దకు చేరుకోగానే ఒక అసాధారణ దృశ్యం కనిపించింది. తలుపు తీసిన మహిళ తీవ్రంగా ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో అర్ధరాత్రి వేళ ఎలుకల మందు ఆర్డర్ చేయడం అతడి మనసులో అనుమానాన్ని రేకెత్తించింది.
మహిళ ముఖంలో కనిపించిన మనోవేదనను గమనించిన డెలివరీ బాయ్ ఆమె ఏదో తీవ్రమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందేమో అని భావించాడు. వెంటనే మానవత్వంతో ఆమెతో మాట్లాడాడు. నీకు ఏ సమస్య ఉన్నా ఆత్మహత్యే పరిష్కారం కాదని చెప్పాడు. నువ్వు ఎలుకల మందు ఆర్డర్ చేసింది ఆత్మహత్య కోసమే కదా అని నేరుగా ప్రశ్నించాడు.
మొదట ఆమె అలా కాదని చెప్పినా.. డెలివరీ బాయ్ చాకచక్యంతో మాట్లాడాడు. నిజంగా ఎలుకల సమస్య ఉంటే పగటి వేళల్లో ఆర్డర్ చేసేవాళ్లని, లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేసుకునేవారని వివరించాడు. అర్ధరాత్రి ఈ సమయంలో ఆర్డర్ చేయడానికి సరైన కారణం ఉండదని చెప్పాడు. అతడి మాటలు మహిళను కదిలించాయి. చివరకు ఆమెను ఒప్పించి ఆ ఆర్డర్‌ను రద్దు చేయించాడు.
ఈ సంఘటన తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని భావించిన డెలివరీ బాయ్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఈరోజు నేను ఏదో సాధించానని నాకు అనిపిస్తోంది” అంటూ అతడు రాసిన మాటలు నెటిజన్ల హృదయాలను తాకాయి. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకు ఈ పోస్ట్‌ను 6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ముందు మనిషిలా ఆలోచించి, తరువాత డెలివరీ వర్కర్‌గా వ్యవహరించావంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి వాళ్లు ఇంకా ఉన్నందునే ఈ ప్రపంచం బతికే ఉందని మరికొందరు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. చిన్న నిర్ణయం, సరైన సమయంలో చేసిన మానవత్వపు పని ఒక ప్రాణాన్ని కాపాడడమే కాదు, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇచ్చింది.
ALSO READ: WOW: అనగనగా ఒక ఊరు.. ఆ ఊరిలో మాత్రం ఒకే ఒక్క ఇల్లు.. ఎక్కడో తెలుసా?





